వైభవంగా వైకుంఠ ఏకాదశి

ABN , First Publish Date - 2020-12-26T05:19:27+05:30 IST

పెందుర్తి వెంకటాద్రి శిఖరంపై ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులకు శుక్రవారం స్వామివారి ఉత్తర ద్వార దర్శన భాగ్యం కల్పించారు.

వైభవంగా వైకుంఠ ఏకాదశి
విశేష అలంకరణలో పెందుర్తి వెంకటాద్రిపైన స్వామివారు

వైష్ణవ ఆలయాల్లో స్వామివారి ఉత్తర ద్వార దర్శనం


పెందుర్తి, డిసెంబరు 25: పెందుర్తి  వెంకటాద్రి శిఖరంపై ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో ముక్కోటి  ఏకాదశి సందర్భంగా భక్తులకు శుక్రవారం స్వామివారి ఉత్తర ద్వార దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు మహర్తి రామానుజాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ దంపతులు ఉత్తర ద్వారంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. 


వెండి మకరతోరణం అందజేత

పెందుర్తి వెంకటాద్రి శిఖరంపై ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి వైసీపీ విశాఖ రూరల్‌ జిల్లా అధ్యక్షుడు శరగడం చినఅప్పలనాయుడు రూ.8 లక్షల విలువ గల  వెండి మకరతోరణాన్ని శుక్రవారం అందజేశారు. 


పలు ప్రాంతాల్లో..

పెందుర్తిరూరల్‌: పెందుర్తి గ్రామీణ మండలంలోని పినగాడి, పెదగాడి, చింతలఅగ్రహారం, చీమలాపల్లి, లక్ష్మీపురం, పురుషోత్తపురం, పొర్లుపాలెం గ్రామాల్లోని రామాలయాలలో శుక్రవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. చింతలఅగ్రహారం రామాలయంలో భక్తులు హరేరామ హరేకృష్ణ నామంతో ఏకాహం నిర్వహించారు. లక్ష్మీపురం గవరపాలెం కాలనీ గల శ్రీకృష్ణ  గీతా మందిరంలో భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. 


వేపగుంటలో..

వేపగుంట: నాయుడుతోట రవినగర్‌ శేషాద్రి కొండపై ఉన్న కల్యాణ వేంకటేశ్వరాలయంలో వేకువజాము 4 గంటల నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. వేపగుంట బీసీ కాలనీ శ్రీవారి వీధి భూలోకమ్మ కాలనీలో ఉన్న వేంకటేశ్వరాలయంలో భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు.

Updated Date - 2020-12-26T05:19:27+05:30 IST