అర్బన్‌ హౌసింగ్‌ లబ్ధిదారులకు ఆమోద పత్రాలు

ABN , First Publish Date - 2020-11-13T06:13:00+05:30 IST

మునిసిపాలిటీలో అర్బన్‌ హౌసింగ్‌ పథకం కింద లబ్ధిదారులకు కేటాయింపు ఉత్తర్వుల పత్రాలు అందజేస్తామని కమిషనర్‌ ఎన్‌.కనకారావు తెలిపారు.

అర్బన్‌ హౌసింగ్‌ లబ్ధిదారులకు ఆమోద పత్రాలు
సచివాలయ సిబ్బందికి కేటాయింపు పత్రాలు అందిస్తున్న అధికారులు

 మునిసిపల్‌ కమిషనర్‌ కనకారావు

నర్సీపట్నం టౌన్‌, నవంబరు 12 : మునిసిపాలిటీలో అర్బన్‌ హౌసింగ్‌ పథకం కింద లబ్ధిదారులకు కేటాయింపు ఉత్తర్వుల పత్రాలు అందజేస్తామని కమిషనర్‌ ఎన్‌.కనకారావు తెలిపారు. గురువారం సచివాలయ సిబ్బందికి  ఈ పత్రాలు అందజేశారు. 17 సచివాలయాల పరిధిలోని వలంటీర్లు  ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు అందజేస్తారని చెప్పారు. 365, 430 చదరపు అడుగులు ఫ్లాట్లకు డిపాజిట్లు చెల్లించిన వారికి అందజేస్తారన్నారు. బ్యాంకు రుణాల మంజూరు కోసం వీరి నుంచి అంగీకార పత్రాలు తీసుకుంటారు.

Updated Date - 2020-11-13T06:13:00+05:30 IST