ఉపాధి కార్యాలయంలో జాబ్‌ మేళా రేపు

ABN , First Publish Date - 2020-12-10T05:51:54+05:30 IST

కంచరపాలెంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 11వ తేదీన శుక్రవారం యువతకు జాబ్‌ మేళాను నిర్వహించనున్నట్టు జిల్లా ఉపాధి కల్పనాధికారిణి (టెక్నికల్‌) కె.సుధ తెలిపారు.

ఉపాధి కార్యాలయంలో జాబ్‌ మేళా రేపు

కంచరపాలెం, డిసెంబరు 9: కంచరపాలెంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 11వ తేదీన శుక్రవారం యువతకు జాబ్‌ మేళాను నిర్వహించనున్నట్టు జిల్లా ఉపాధి కల్పనాధికారిణి (టెక్నికల్‌) కె.సుధ తెలిపారు. మేళాలో సినర్జీస్‌ కాస్టింగ్‌  లిమిటెడ్‌ కంపెనీ ప్రతినిధులు పాల్గొని ఆపరేటర్‌ ట్రైనీస్‌ ఉద్యోగాలకు ఇంటర్వ్యులు నిర్వహిస్తారని తెలిపారు. ఐటీఐలో ఫిట్టర్‌, మెషినిస్టు, టర్నర్‌, డీజిల్‌ మెకానిక్‌, ఎంఎంటీఎస్‌, సీఎన్‌సీ ట్రేడుల్లో ఉత్తీర్ణత సాధించిన వారు, మెకానికల్‌, మెటలర్జీ, ఆటో మొబైల్‌లో డిప్లొమా పూర్తిచేసిన వారు ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చునని తెలిపారు. ఆసక్తి, అర్హత గల నిరుద్యోగ యువత ఈనెల 11న ఉదయం 10 గంటలకు అన్నీ ధ్రువపత్రాలు, జిరాక్స్‌ కాపీలతో హాజరుకావాలని డీఈవో సుధ సూచించారు. 

Updated Date - 2020-12-10T05:51:54+05:30 IST