-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Unions Says Dont trick plays with farmer lifes
-
రైతుల జీవితాలలో ఆటలొద్దు
ABN , First Publish Date - 2020-12-15T06:05:33+05:30 IST
వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి రైతుల జీవితాలలో ఆటలాడవద్దని సీపీఐ ఏరియా సమితి కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు పేర్కొన్నారు.

సీపీఐ ఏరియా సమితి కార్యదర్శి అప్పలరాజు
చోడవరం, డిసెంబరు 14: వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి రైతుల జీవితాలలో ఆటలాడవద్దని సీపీఐ ఏరియా సమితి కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు పేర్కొన్నారు. స్థానిక పోస్టాఫీసు వద్ద సోమవారం ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయాన్ని బహుళజాతి కంపెనీలకు తాకట్టు పెట్టి రైతుల మెడకు ఉరితాళ్లు బిగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నదన్నారు. ప్రభుత్వం బేషరతుగా మూడు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు బొబ్బిలి శంకరరావు, సబ్బవరపు గణేశ్, పి.అప్పారావు. జలగడుగుల గణేశ్ పాల్గొన్నారు.