వ్యాపారులకు రూ.రెండు కోట్ల రుణం
ABN , First Publish Date - 2020-11-13T06:13:06+05:30 IST
యూనియన్ బ్యాంక్ పరిధిలో వ్యాపారులకు క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఫర్ మైక్రో యూనిట్స్ (సీజీఎఫ్‌ఎంయూ) ద్వారా రూ.రెండు కోట్లు రుణం మంజూరు చేస్తామని విశాఖపట్నం ఫీల్డ్ జనరల్ మేనేజర్ (ఎఫ్‌జీఎం) బి.శ్రీనివాస్ షెట్టి అన్నారు.
యూబీఐ ఎఫ్‌జీఎం బి.శ్రీనివాస్ షెట్టి
చింతపల్లి, నవంబరు 12: యూనియన్ బ్యాంక్ పరిధిలో వ్యాపారులకు క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఫర్ మైక్రో యూనిట్స్ (సీజీఎఫ్‌ఎంయూ) ద్వారా రూ.రెండు కోట్లు రుణం మంజూరు చేస్తామని విశాఖపట్నం ఫీల్డ్ జనరల్ మేనేజర్ (ఎఫ్‌జీఎం) బి.శ్రీనివాస్ షెట్టి అన్నారు. గురువారం ఆధునీకరించిన స్థానిక యూబీఐ బ్రాంచ్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. చిరు వ్యాపారులకు ఎటువంటి పూచికత్తు లేకుండా రూ.పది లక్షల వరకు ముద్ర రుణం అందజేస్తామన్నారు. గిరిజన ప్రాంతం చింతపల్లి, సీలేరు, పాడేరు, రంపచోడవరంలో యూబీఐ సేవలను 1970లో ప్రారంభించామని, నేటికి 50 ఏళ్లు పూర్తిచేసుకున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో డీజీఎం అజయ్‌కుమార్, డిప్యూటీ రీజనల్ హెడ్ రమణమూర్తి, స్థానిక బ్యాంక్ మేనేజర్ అంబ్రిష్, ఫీల్డ్ అధికారి రాధాకృష్ణ, డిప్యూటీ బ్రాంచ్ హెడ్ హరికృష్ణ, వర్తక సంఘం నాయకులు పెదిరెడ్ల బేతాళుడు, జోగేశ్వరరావు, మాజీ సర్పంచ్ కంకిపాటి వీరన్నపడాల్ పాల్గొన్నారు.