ఇరు వర్గాల ఘర్షణలో నలుగురికి గాయాలు

ABN , First Publish Date - 2020-11-19T06:05:43+05:30 IST

రెండు గ్రామాలకు చెందిన యువకుల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు గాయపడ్డారు. మర్రివలస గ్రామంలో బుధవారం యువకులు వాలీబాల్‌ ఆడుతుండగా ఎల్‌.వెంకటేశ్‌ గాయపడ్డాడు.

ఇరు వర్గాల ఘర్షణలో నలుగురికి గాయాలు
ఘర్షణ పడుతున్న కొత్తకోట, మర్రివలస యువకులు

కొత్తకోట, మర్రివలస యువకుల మధ్య ఘటన


రావికమతం: రెండు గ్రామాలకు చెందిన యువకుల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు గాయపడ్డారు. మర్రివలస గ్రామంలో బుధవారం యువకులు వాలీబాల్‌ ఆడుతుండగా ఎల్‌.వెంకటేశ్‌ గాయపడ్డాడు. దీంతో అతన్ని ద్విచక్ర వాహనంలో సహచరులు నర్సీపట్నం ఆసుపత్రికి తీసుకు వెళ్తున్నారు. ఎర్రిగెడ్డ బ్రిడ్జి సమీపంలో కొత్తకోటకు చెందిన యువకులు రోడ్డుకు అడ్డంగా బైక్‌లు పెట్టి సెల్ఫీలు దిగుతుండగా, దారి ఇవ్వాలని వారు కోరారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తగా, కొత్తకోట యువకులు దాడి చేశారు. దీంతో మర్రివలసకు చెందిన శివ తీవ్రంగా గాయపడగా, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. మర్రివలస యువకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది.


Updated Date - 2020-11-19T06:05:43+05:30 IST