-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Two headed calf in Amalapuram
-
అమలాపురంలో రెండు తలల దూడ
ABN , First Publish Date - 2020-06-23T09:46:36+05:30 IST
విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం వేములపూడి శివారు అమలాపురంలో ఓ ఆవుకు రెండు తలల దూడ జన్మించింది.

ఆపరేషన్ చేసి వైద్యుడు బయటకు తీసిన వైద్యుడు
అప్పటికే మృతి
కోటవురట్ల, జూన్ 22: విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం వేములపూడి శివారు అమలాపురంలో ఓ ఆవుకు రెండు తలల దూడ జన్మించింది. వైద్యుడు ఆపరేషన్ చేసి దూడను బయటకు తీశారు. అయితే అప్పటికే అది మృతిచెందింది. గ్రామంలోని శెట్టి రాంబాబుకు చెందిన ఆవు ఈనేందుకు సోమవారం ఇబ్బంది పడుతుండడంతో పశు వైద్యాధికారి డాక్టర్ పెట్ల నరేష్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చి ఆవుకు ఆపరేషన్ చేసి దూడను బయటకు తీశారు. అయితే రెండు తలలు కలిగి వున్న దూడ అప్పటికే చనిపోయింది. ఈ సందర్భంగా డాక్టర్ నరేష్ మాట్లాడుతూ జన్యుపరమైన లోపాల వల్ల ఇలాంటి దూడలు జన్మిస్తాయని, ఇటువంటివి పుట్టిన వెంటనే చనిపోవడం సర్వసాధారణమని పేర్కొన్నారు. దూడను చూసేందుకు స్థానికులతో పాటు పరిసర గ్రామాల వారు పెద్ద సంఖ్యలో విచ్చేశారు.