రెండు పూరిళ్లు నేలమట్టం
ABN , First Publish Date - 2020-12-31T05:28:19+05:30 IST
స్థానిక కొంకివీధిలో సర్వే నంబర్-87లో ప్రభుత్వ కొండ పోరంబోకు స్థలంలో అక్రమంగా నిర్మించిన రెండు పూరిళ్లను మండల రెవెన్యూ సిబ్బంది బుధవారం తొలగించారు.

భీమునిపట్నం, డిసెంబరు 30: స్థానిక కొంకివీధిలో సర్వే నంబర్-87లో ప్రభుత్వ కొండ పోరంబోకు స్థలంలో అక్రమంగా నిర్మించిన రెండు పూరిళ్లను మండల రెవెన్యూ సిబ్బంది బుధవారం తొలగించారు. సంబంధిత ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు రెండు పూరిళ్లు నిర్మించి వెళ్లిపోయారు. వీటికి విద్యుత్ మీటర్లను కూడా వేయించారు. కాగా సర్వే చేస్తున్న ఆర్‌ఐ దువ్వి రామకృష్ణ బృందం వీటిని గుర్తించారు. విద్యుత్ మీటర్లు కొంతం శివాజీప్రసాద్, లక్కోజుడొంక రాజు పేర్లపై ఉన్నాయని ఆర్‌ఐ తెలిపారు. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన ఈ పూరిళ్లను తహసీల్దార్ ఈశ్వరరావు ఆదేశాల మేరకు తొలగించామన్నారు.