-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » two accused arrested in murder case
-
హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు
ABN , First Publish Date - 2020-03-24T09:00:25+05:30 IST
బాలయ్యశాస్త్రి లే అవుట్‌లో వెళ్లే మార్గంలో జాతీయ రహదారికి ఆనుకోని గ్రీన్‌బెల్టులో ఉన్న నవదుర్గా పీఠంలో శుక్రవారం రాత్రి జరిగిన ఓ వ్యక్తి హత్య కేసులో ఇద్దరు నిందితులను...

- - మద్యం మత్తులో స్నేహితుల ఘాతుకం
సీతంపేట, మార్చి 23 : బాలయ్యశాస్త్రి లే అవుట్‌లో వెళ్లే మార్గంలో జాతీయ రహదారికి ఆనుకోని గ్రీన్‌బెల్టులో ఉన్న నవదుర్గా పీఠంలో శుక్రవారం రాత్రి జరిగిన ఓ వ్యక్తి హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
బొబ్బిలి ప్రాంతానికి చెందిన ఎల్లంకి ధనుంజయ్ (42) కుటుంబ కలహాల కారణంగా కొద్ది కాలంగా జీవనోపాధి నిమిత్తం నగరానికి వచ్చి దినసరి కూలీగా పనులు చేసేవాడు. పని చేయగా వచ్చే డబ్బుతో మద్యం తాగేవాడు. ఈ క్రమంలో ఒక కేటరింగ్ సంస్థలో పనికి వెళ్లాడు. అక్కడ ధనుంజయ్‌కు చక్కురి చంద్రశేఖర్ (29), మువ్వల ప్రసాద్ (46)తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరు కూడా రోజువారి పనులు చేయడం, ఆ డబ్బులతో మద్యం తాగడం చేసేవారు. దీంతో ముగ్గురూ కలిసి పనులు చేయడం, మందు తాగడం పనిగా పెట్టుకున్నారు. రోడ్డు పక్కన, బస్సు షెల్టర్లలో పడుకోవడం చేసేవారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఆ ముగ్గురు కలిసి నరవ వెళ్లి కల్లు తాగారు. తర్వాత ఎన్‌ఏడీ కూడలి వద్దకు వచ్చి మళ్లీ మద్యం తాగారు. ఆ మత్తులో వారి మధ్య గొడవ జరిగింది. తన జేబులోని రూ.రెండు వేలు డబ్బులు తీసివేశాడంటూ ధనుంజయ్‌తో చంద్రశేఖర్ గొడవ పడ్డాడు. వాదులాడుకుంటూనే గురుద్వార్ చేసిన వీరు మరోసారి మద్యం తాగారు.
అనంతరం నాలుగో పట్టణ పోలీసు స్టేషన్ వెనుక గల బస్టాప్‌లో పడుకున్నారు. అదే సమయంలో ధనుంజయ్ జేబులో నుంచి రూ.500 కింద పడ్డాయి. దీంతో మళ్లీ గొడవ పడ్డారు. అనంతరం ధనుంజయ్ జాతీయ రహదారి పక్కనే గల గ్రీన్‌బెల్టులో గల నవదుర్గా పీఠంలో పడుకున్నాడు. అక్కడకు చంద్రశేఖర్, ప్రసాద్ వెళ్లి ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో ధనుంజయ్ పెద్ద రాయితో తలపై బలంగా మోదడంతో ధనుంజయ్ అక్కడికక్కడే మృతి చెందాడు.
వెంటనే చంద్రశేఖర్, ప్రసాద్ అక్కడి నుంచి పరారయ్యారు. శనివారం తెల్లవారుజామున పీఠం వద్దకు వచ్చి చూడగా రక్తంమడుగులో పడి ఉన్న ధనుంజయ్ మృతదేహం కనిపించింది. అనంతరం చంద్రశేఖర్, ప్రసాద్ సముద్రానికి వెళ్లి స్నానం చేసి ఎవరి అంతట వారు వెళ్లిపోయారు.
ఈ కేసులో విచారణ చేపట్టిప ఎస్‌ఐ సూర్యానారాయణ కేటరింగ్ నిర్వాహకుల నుంచి సమాచారం సేకరించి నిందితులను అరెస్టు చేశారు.