చలో విజయవాడను జయప్రదం చేయండి

ABN , First Publish Date - 2020-12-14T05:26:31+05:30 IST

భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 15న చేపట్టిన చలో విజయవాడను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు వై.ఎన్‌.భద్రం పిలుపునిచ్చారు.

చలో విజయవాడను జయప్రదం చేయండి
సమావేశంలో మాట్లాడుతున్న వై.ఎన్‌.భద్రం

కొత్తూరు, డిసెంబరు 13 : భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 15న చేపట్టిన చలో విజయవాడను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు వై.ఎన్‌.భద్రం పిలుపునిచ్చారు. ఆదివారం సత్యనారాయణపురంలో మూలపేట భవన నిర్మాణ కార్మికులతో వనభోజన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందరంగా మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును కాపాడాలన్నారు. పెండింగ్‌లో ఉన్న క్లైమ్‌ల నిధులు వెంటనే మంజూరు చేయాలని, ఇసుకను అందుబాటులోకి తేవాలనే సమస్యలపై చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. సంఘ అధ్యక్షుడు చిన్న, కార్యదర్శి కోన లక్ష్మణ, రాము, నరసింగరావు, సత్యనారాయణ, రమణ తదితరులు పాల్గొన్నారు.


కశింకోటలో...

కశింకోట: చలో విజయవాడను విజయవంతం చేయాలని భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా నాయకులు ఆడారి వెంకటరావు, కోన లక్ష్మణ కోరారు. కశింకోటలో ఆదివారం కార్మికులతో మాట్లాడారు. 

Updated Date - 2020-12-14T05:26:31+05:30 IST