బైక్‌ బోల్తాపడి గిరిజనుడి మృతి

ABN , First Publish Date - 2020-11-26T06:30:20+05:30 IST

మండలంలోని బొండపల్లి ఘాట్‌ రోడ్డులో ద్విచక్ర వాహనం బోల్తా పడడంతో గిరిజనుడు మృతి చెందాడు.

బైక్‌ బోల్తాపడి గిరిజనుడి మృతి

పెదబయలు, నవంబరు 25: మండలంలోని బొండపల్లి ఘాట్‌ రోడ్డులో ద్విచక్ర వాహనం బోల్తా పడడంతో గిరిజనుడు మృతి చెందాడు. లింగేటి పంచాయతీ పిల్లిపుట్టు గ్రామానికి చెందిన కోడా నారాయణబాబు తన కుమారుడితో కలసి బుధవారం ఉదయం బైక్‌పై పెదబయలు వస్తున్నాడు. మార్గమధ్యంలో బొండపల్లి ఘాట్‌ మలుపు వద్ద అదుపుతప్పి బైక్‌ బోల్తాపడింది. ఈ ఘటనలో నారాయణబాబు తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతని కుమారుడు పవన్‌కుమార్‌కు తీవ్ర గాయలయ్యాయి. కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నా ఎస్‌ఐ పి.రాజారావు తెలిపారు.

Updated Date - 2020-11-26T06:30:20+05:30 IST