ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలి

ABN , First Publish Date - 2020-05-29T09:41:37+05:30 IST

కరోనా నేపథ్యంలో ప్రయాణికుల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పౌర రవాణాశాఖ విజయనగరం జోన్‌ ..

ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలి

పీటీడీ ఈడీ రవికుమార్‌


ద్వారకాబస్‌స్టేషన్‌, మే 28: కరోనా నేపథ్యంలో ప్రయాణికుల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పౌర రవాణాశాఖ విజయనగరం జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ చింతా రవికుమార్‌ అధికారులకు సూచించారు. ద్వారకా బస్‌స్టేషన్‌ను గురువారం ఆయన సందర్శించారు. ప్రయాణికుల భద్రతకు తీసుకుంటున్న చర్యలు, థర్మల్‌ స్ర్కీనింగ్‌, అందుబాటులో శానిటైజర్‌, మాస్కుల వినియోగం పరిశీలించారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్లేవారికి స్పెషల్‌ రిజర్వేషన్‌ కౌంటర్‌ను ప్రారంభించారు. అనంతరం వాల్తేరు డిపోలో నిర్వహించిన సమావేశంలో ఈడీ మాట్లాడుతూ ఉద్యోగులంతా కరోనా వైరస్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. లాజిస్టిక్స్‌ ఆపరేషన్స్‌ పెంచాలని సూచించారు.  రీజనల్‌ మేనేజర్‌ ఎంవై దానం, వాల్తేరు డిపో మేనేజర్‌ గంగాధర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ హనుమశ్రీ, డిప్యూటీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్లు సుధాబిందు (అర్బన్‌ ), కణితి వెంకటరావు (విశాఖ జిల్లా), డిప్యూటీ చీఫ్‌ మెకానికల్‌ ఇంజినీర్లు అప్పలనాయుడు (అర్బన్‌), అప్పలనారాయణ (జిల్లా) తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-29T09:41:37+05:30 IST