డేటా సైన్సెస్‌పై అధ్యాపకులకు శిక్షణ
ABN , First Publish Date - 2020-12-20T05:14:56+05:30 IST
ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో ప్రాధాన్యం సంతరించుకుంటున్న డేటా సైన్సెస్‌పై గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, అఖిలభారత సాంకేతిక విద్యా మండలి (ఏజీసీటీఈ) ట్రైనింగ్ అండ్ లెర్నింగ్ అకాడమీ సంయుక్తంగా జనవరి నాలుగు నుంచి ఎనిమిదో తేదీ వరకు అధ్యాపకులకు ఆన్‌లైన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు కార్యక్రమ కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ కె.వేదవతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

సాగర్‌నగర్, డిసెంబరు 19: ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో ప్రాధాన్యం సంతరించుకుంటున్న డేటా సైన్సెస్‌పై గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, అఖిలభారత సాంకేతిక విద్యా మండలి (ఏజీసీటీఈ) ట్రైనింగ్ అండ్ లెర్నింగ్ అకాడమీ సంయుక్తంగా జనవరి నాలుగు నుంచి ఎనిమిదో తేదీ వరకు అధ్యాపకులకు ఆన్‌లైన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు కార్యక్రమ కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ కె.వేదవతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో జరిగే ఈ శిక్షణ కార్యక్రమంలో ఐటీ పరిశ్రమల నిపుణులు, డేటా సైన్స్ పరిశోధకులు పాల్గొని అధ్యాపకులకు దిశానిర్దేశం చేస్తారన్నారు. ఆసక్తి గలవారు ఈనెల 27లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 9885903210 సెల్ నంబర్‌ను సంప్రతించాలని కోరారు.