-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » train
-
ప్రత్యేక రైలుగా విశాఖ ఎక్స్‌ప్రెస్
ABN , First Publish Date - 2020-12-06T06:00:11+05:30 IST
విశాఖ మీదుగా భువనేశ్వర్, సికింద్రాబాద్ మధ్య నడిచే విశాఖ ఎక్స్‌ప్రెస్‌ను ప్రత్యేక రైలుగా ప్రవేశపెడుతున్నట్టు వాల్తేరు డివిజన్ సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు.

విశాఖపట్నం, డిసెంబరు 5: విశాఖ మీదుగా భువనేశ్వర్, సికింద్రాబాద్ మధ్య నడిచే విశాఖ ఎక్స్‌ప్రెస్‌ను ప్రత్యేక రైలుగా ప్రవేశపెడుతున్నట్టు వాల్తేరు డివిజన్ సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. అలాగే విశాఖ మీదుగా సికింద్రాబాద్, గౌహతి మధ్య మరో ప్రత్యేక రైలును అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు పేర్కొన్నారు.
సికింద్రాబాద్-భువనేశ్వర్-సికింద్రాబాద్ స్పెషల్ విశాఖ ఎక్స్‌ప్రెస్
07016 నంబరు గల ప్రత్యేక రైలు ప్రతిరోజు సాయంత్రం 4:50 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మర్నాడు ఉదయం 7:15 గంటలకు విశాఖ చేరి తిరిగి ఇక్కడ నుంచి 7:35 గంటలకు బయలుదేరి అదేరోజు మధ్యాహ్నం 3:25 గంటలకు భువనేశ్వర్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 07015 నంబరు గల ప్రత్యేక రైలు ప్రతిరోజు ఉదయం 8:45 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరి అదేరోజు సాయంత్రం 4:10 గంటలకు విశాఖ చేరి తిరిగి ఇక్కడ నుంచి 4:30 గంటలకు బయలుదేరి మర్నాడు ఉదయం 7:30 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.
గౌహతి-సికింద్రాబాద్-గౌహతి(వయా విశాఖ)
02514 నంబరు గల ప్రత్యేక రైలు డిసెంబరు 31వ తేదీ వరకు ప్రతి గురువారం ఉదయం 6:20 గంటలకు గౌహతిలో బయలుదేరి మర్నాడు మధ్యాహ్నం 2:55 గంటలకు విశాఖ చేరుతుంది. తిరిగి ఇక్కడ నుంచి 3:15 గంటలకు బయలుదేరి మర్నాడు (శనివారం) ఉదయం 3:05 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 02513 నంబరు గల ప్రత్యేక రైలు జనవరి రెండో తేదీ వరకు ప్రతి శనివారం సాయంత్రం 4:35 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మర్నాడు(ఆదివారం) ఉదయం 4:20 గంటలకు విశాఖ చేరి తిరిగి ఇక్కడ నుంచి 4:40 గంటలకు బయలుదేరి సోమవారం మధ్యాహ్నం 1:00 గంటకు గౌహతి చేరుతుంది.