టోల్‌ప్లాజా కార్మికులు ఆందోళన విరమణ

ABN , First Publish Date - 2020-11-13T06:24:56+05:30 IST

వేంపాడు హైవే టోల్‌ప్లాజా కార్మికులు చేపడుతున్న ఆందోళనపై యాజమాన్యం స్పందించింది.

టోల్‌ప్లాజా కార్మికులు ఆందోళన విరమణ

 బోనస్‌, తదితరాలపై యాజమాన్యం హామీ

నక్కపల్లి, నవంబరు 12 :  వేంపాడు హైవే టోల్‌ప్లాజా కార్మికులు చేపడుతున్న ఆందోళనపై యాజమాన్యం స్పందించింది. తమ న్యాయమైన సమస్యలతో పాటు, బోనస్‌ ఇవ్వాలని కోరుతూ సీఐటీయూ, ఏఐటీయూసీ సంఘాల ప్రతినిధుల ఆధ్వర్యంలో టోల్‌ప్లాజా ఆవరణలో కార్మికులు గురువారం విధులు బహిష్కరించి, ఆందోళన చేపట్టారు. దీంతో కార్మికుల సమస్యలను ఎస్‌ఐ అప్పన్న అడిగి తెలుసుకున్నారు. టోల్‌ప్లాజా యాజమాన్యంతో పలుమార్లు చర్చించారు.  కార్మికులకు ఏడాదికి రూ.9 వేలు బోనస్‌ చెల్లించేందుకు, ఈఎస్‌ఐ, గుర్తింపు కార్డులు, పే స్లిప్పులు, అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు ఇస్తామని టోల్‌ప్లాజా యాజమాన్యం ప్రకటించినట్టు సీపీఎం నేత అప్పలరాజు తెలిపారు. దీంతో కార్మికులు ఆందోళన విరమించారు. సీఐటీయూ నేతలు అప్పలరాజు, రాజేశ్‌, ఏఐటీయుసీ నేత జేవీ ప్రభాకర్‌రావు, నర్సయ్య, రాజేశ్‌, రాజశేఖర్‌, పాండు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-11-13T06:24:56+05:30 IST