తెరుచుకున్న సింహగిరి రెండో టోల్‌గేట్‌

ABN , First Publish Date - 2020-12-13T05:33:31+05:30 IST

కొవిడ్‌ నిబంధనలతో సుమారు ఏడు నెలల పాటు మూసివేసిన సింహగిరి రెండో టోల్‌గేట్‌ను శనివారం తెరిచారు.

తెరుచుకున్న సింహగిరి రెండో టోల్‌గేట్‌
వాహనాలకు టికెట్ల విక్రయాలు చేస్తున్న సిబ్బంది

సింహాచలం, డిసెంబరు 12: కొవిడ్‌ నిబంధనలతో సుమారు ఏడు నెలల పాటు మూసివేసిన సింహగిరి రెండో టోల్‌గేట్‌ను శనివారం తెరిచారు. తరచూ శని, ఆదివారల్లో సింహగిరి తొలి టోల్‌గేట్‌ వద్ద, తొలిపావంచా, కుమ్మరివీధి కూడలిలో తలెత్తుతున్న ట్రాఫిక్‌ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పోలీసులు, అధికారుల సూచన మేరకు రెండో టోల్‌గేట్‌ను తెరిచారు. ఇక్కడ వాహనాల టికెట్లతో పాటు రూ.100 శ్రీఘ్రదర్శనం, రూ.300 అతి శ్రీఘ్రదర్శనం టికెట్లను కూడా భక్తులకు విక్రయిస్తున్నారు. 

Updated Date - 2020-12-13T05:33:31+05:30 IST