టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ధర్నా

ABN , First Publish Date - 2020-12-29T05:53:32+05:30 IST

ప్రైవేటు, ఎయిడెడ్‌ కళాశాలల్లో పీజీ, ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులు చదువుతున్న పేద విద్యార్థులకు జగనన్న వసతి, విద్యా దీవెన పథకాలు వర్తించకుండా ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 77ను వెంటనే రద్దు చేయాలని తెలుగునాడు విద్యార్థి సమాఖ్య అనకాపల్లి పార్లమెంట్‌ అధ్యక్షుడు పెదిరెడ్డి వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి దేవర శివ డిమాండ్‌ చేశారు.

టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ధర్నా
ఆందోళన చేస్తున్న టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ప్రతినిధులు

పాయకరావుపేట, డిసెంబరు 28 : ప్రైవేటు, ఎయిడెడ్‌ కళాశాలల్లో పీజీ, ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులు చదువుతున్న పేద విద్యార్థులకు జగనన్న వసతి, విద్యా దీవెన పథకాలు  వర్తించకుండా ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 77ను వెంటనే రద్దు చేయాలని తెలుగునాడు విద్యార్థి సమాఖ్య అనకాపల్లి పార్లమెంట్‌ అధ్యక్షుడు పెదిరెడ్డి వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి దేవర శివ డిమాండ్‌ చేశారు. సోమవారం ఇక్కడ జీవోను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళ నలో మాట్లాడారు. పేద విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసే ఇటువంటి జీవోను వెంటనే ఉపసంహరించు కోవాలన్నారు. పలువురు టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులతోపాటు, విద్యార్థులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-29T05:53:32+05:30 IST