టిడ్కో ఇళ్లను బయటవారికిస్తే ఉద్యమిస్తాం
ABN , First Publish Date - 2020-12-18T05:23:04+05:30 IST
ఏపీ టిడ్కో గృహాలను ఇతర ప్రాంతాల వారికిస్తే ఉద్యమిస్తామని ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ హెచ్చరించారు.

పేదల గృహాలు కాజేయడానికి వైకాపా కుట్ర
ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్, మాజీ ఎమ్మెల్యే పీలా
అనకాపల్లి, డిసెంబరు 17: ఏపీ టిడ్కో గృహాలను ఇతర ప్రాంతాల వారికిస్తే ఉద్యమిస్తామని ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ హెచ్చరించారు. గురువారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఇక్కడి అధికార పార్టీ నాయకులకు అనకాపల్లి పట్టణంలోని పేద ప్రజలు కనిపించలేదా అని ప్రశ్నించారు. సత్యనారాయణపురంలో నిర్మించిన ఇళ్లలో 1609 గృహాలను విశాఖపట్నం సౌత్ నియోజకవర్గం వారికి ఇవ్వడానికి వారు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా పట్టణంలో శుక్రవారం భారీ ఆందోళన కార్యక్రమం చేపడతామని తెలిపారు.
అమరావతి రైతులకు మద్దతుగా నిరసన
అమరావతి రైతుల పోరాటానికి మద్దతుగా ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయడానికి సీఎం జగన్ కుట్ర పన్నుతున్నారన్నారు. పట్టుమని 13 జిల్లాలు కూడా లేని ఏపీకి మూడు రాజధానుల అవసరమేమిటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు మళ్ల సురేంద్ర, బీఎస్‌ఎంకే జోగినాయుడు, ఆళ్ల రామచంద్రరావు, పి.త్రినాథ్, ఎస్.సన్యాసిరావు, బి.ప్రసాద్ పాల్గొన్నారు.