-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » tidco houses
-
సొంతఇంటి కల నెరవేరనుంది
ABN , First Publish Date - 2020-12-28T05:20:41+05:30 IST
గాజువాక నియోజకవర్గం పరిధిలో టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు.

టిడ్కో ఇళ్ల పంపిణీకి రంగం సిద్ధం
టీడీపీ హయాంలో మెజార్టీ ఇళ్ల నిర్మాణం
గాజువాక, డిసెంబరు 27 : గాజువాక నియోజకవర్గం పరిధిలో టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. నియోజకవర్గం పరిధి సుమారుగా 12,520 టిడ్కో ఇళ్లను ఈ నెలాఖరులోగా పంపిణీ చేయనున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఇంటి నిర్మాణాలు జరగ్గా మరికొన్ని ప్రాంతాల్లో కొత్తగా నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు.
దువ్వాడ, భానోజీతోట, తలారివానిపాలెం, వైజంక్షన్, ప్రాంతాల్లో 6,176 ఇళ్లను నిర్మించగా, అప్పికొండ 1, అప్పికొండ 2, నడుపూరు, పెదగంట్యాడ, బర్మాకాలనీల్లో 2,496 ఇళ్లను నిర్మించనున్నారు. పరవాడ, మంత్రిపాలెంలలో 3,848 ఇళ్లను నిర్మించనున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు దాదాపు పూర్తికాగా కొత్తగా ఇళ్ల నిర్మాణం పనులు కూడా ప్రారంభించారు.
ఇదిలా ఉండగా సింగిల్ బెడ్ రూం ఇళ్లను 300, 365 ,430 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. 300 చ.అ ఇళ్లను ఉచితంగా కేటాయిస్తుండగా, రూపాయికే రిజిస్ట్రేషన్ చేయనున్నారు. 365 చ.అ లకు ఎన్‌రోల్‌మెంటుకు రూ. 25వేలు, 430 చ.అ ల ఇళ్ల ఎన్‌రోల్‌మెంట్‌కు రూ. 50 వేలు చెల్లించాలి. ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చులో కొంత మొత్తాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తుండగా మిగిలిన మొత్తాన్ని బ్యాంకర్లు రుణాలుగా అందజేయనున్నారు.
గాజువాక నియోజక వర్గం పరిధిలో లభ్దిదారుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఇళ్ల నిర్మాణానికి అధికారులు ఇంకా స్థల సేకరణ చేస్తున్నారు. గతంలో డీడీలు చెల్లించిన వారికి కూడా ఇళ్లు ఇవ్వనున్నట్టు అధికారులు ప్రకటించారు.