-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » three crores release for roads
-
మూడు రోడ్ల అభివృద్ధికి రూ.3.06 కోట్లు
ABN , First Publish Date - 2020-12-06T05:54:05+05:30 IST
నియోజకవర్గంలోని రావికమతం, బుచ్చెయ్యపేట మండలాల్లో మూడు రహదారుల అభివృద్ధికి రూ.3.06 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తెలిపారు.

ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ
చోడవరం, డిసెంబరు 5: నియోజకవర్గంలోని రావికమతం, బుచ్చెయ్యపేట మండలాల్లో మూడు రహదారుల అభివృద్ధికి రూ.3.06 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తెలిపారు. ఈ వివరాలను శనివారం విలేకరులకు అందించారు. రావికమతం మండలంలోని కొత్తకోట మర్రిపాలెం రోడ్డు నుంచి గొల్లపాలెం మార్గానికి రూ.కోటి 15 లక్షలు, ఆర్‌ఈసీ రోడ్డు నుంచి మట్టవానిపాలెం వయా గుడివాడ రహదారికి రూ.కోటి 16 లక్షలు, బుచ్చెయ్యపేట మండలంలో బుచ్చెయ్యపేట కేపీ అగ్రహారం మార్గం నుంచి ఐతంపూడి రోడ్డుకు రూ.74.70 లక్షలు మంజూరైనట్టు ఆయన చెప్పారు.