అధికార పార్టీ నేతల బెదిరింపులపై సీఎంకు ఫిర్యాదు

ABN , First Publish Date - 2020-03-02T10:18:28+05:30 IST

ఆదివాసీల హక్కులు, చట్టాల అమలుపై పోరాటం సాగిస్తున్న జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ప్రతినిధులను అధికార పార్టీకి చెందిన నేతలు బెదిరిస్తున్నారని, దీనిపై

అధికార పార్టీ నేతల బెదిరింపులపై సీఎంకు ఫిర్యాదు

  • ఆదివాసీ జేఏసీ కన్వీనర్‌  రామారావుదొర

పాడేరు: ఆదివాసీల హక్కులు, చట్టాల అమలుపై పోరాటం సాగిస్తున్న జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ప్రతినిధులను అధికార పార్టీకి చెందిన నేతలు బెదిరిస్తున్నారని, దీనిపై సీఎం జగన్‌కు ఫిర్యాదు చేస్తామని ఆదివాసీ జేఏసీ కన్వీనర్‌ రామారావుదొర అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. షెడ్యూల్‌ ప్రాంతంలో ఆదివాసీలకున్న చట్టాలు, హక్కులను కాపాడాలనే లక్ష్యంతో జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఉద్యమిస్తుంటే, దానికి మద్దతుగా నిలవాల్సిన అధికార పార్టీ(వైసీపీ)కి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు తమను ఫోన్లలో బెదిరిస్తున్నారన్నారు. ఇటువంటి చర్యలు సరికాదని, దీనిపై లిఖిత పూర్వకంగా  ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి ఫిర్యాదు చేస్తామన్నారు. అధికార పార్టీకి చెందిన నేతలు తీరు మార్చుకోవాలని లేకుంటే ఆదివాసీల ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందన్నారు. అలాగే జేఏసీ ఉద్యమంలో ఉన్న వారెవరూ అధికార పార్టీకి చెందిన వారి బెదిరింపులకు భయపడవద్దని, పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని కన్వీనర్‌ రామారావుదొర కోరారు. ఈకార్యక్రమంలో జేఏసీ కో-కన్వీనర్లు సుబ్రహ్మణ్యం, రాధాకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2020-03-02T10:18:28+05:30 IST