-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » There is constant traffic tension
-
అక్కడ నిత్యం ట్రాఫిక్ టెన్షన్!
ABN , First Publish Date - 2020-12-29T05:29:57+05:30 IST
ఉదయమైనా.. సాయంత్రమైనా ఆ జంక్షన్ దాటాలంటే అందరికీ ఒక్కటే టెన్షన్.

సిగ్నల్ లైట్లు పనిచేయకపోవడంతో బారులుతీరి నిలిచిపోయిన వాహనాలు
తీవ్ర ఇబ్బందులకు గురైన ప్రయాణికులు
వెంకోజీపాలెం/ఆరిలోవ, డిసెంబరు 28: ఉదయమైనా.. సాయంత్రమైనా ఆ జంక్షన్ దాటాలంటే అందరికీ ఒక్కటే టెన్షన్. అర కిలోమీటర్ మేర ఆ కూడలి దాటడం నరకప్రాయమే. ఇదీ వెంకోజీపాలెం నుంచి హనుమంతవాక జంక్షన్ వరకు ఉన్న జాతీయ రహదారి పరిస్థితి. ఈ మార్గంలో రాకపోకలు సాగించేవారు సుమారు 15 నుంచి 30 నిమిషాలు ఈ జంక్షన్‌లో ట్రాఫిక్ ఇబ్బందులకు గురవ్వడం సర్వసాధారణంగా మారింది. కాగా సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ఇక్కడి సిగ్నల్ లైట్లు పనిచేయకపోవడంతో ట్రాఫిక్ మరింతగా స్తంభించిపోయింది. ట్రాఫిక్ పోలీసులు మాన్యువల్ పద్ధతిలో వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించినప్పటికీ ఎక్కడికక్కడ వాహనాలు బారులుతీరి నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.