-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Theft at a cell phone accessories store
-
సెల్‌ఫోన్ పరికరాల దుకాణంలో చోరీ
ABN , First Publish Date - 2020-12-28T04:33:04+05:30 IST
స్థానిక మెయిన్‌రోడ్డు వేల్పులవీధి గౌరీ పరమేశ్వరుల గుడి ఎదుట గల సెల్‌ఫోన్ పరికరాల దుకాణంలో శనివారం రాత్రి చోరీ జరిగింది.

అనకాపల్లిటౌన్, డిసెంబరు 27: స్థానిక మెయిన్‌రోడ్డు వేల్పులవీధి గౌరీ పరమేశ్వరుల గుడి ఎదుట గల సెల్‌ఫోన్ పరికరాల దుకాణంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. కవితా మొబైల్స్ దుకాణం షట్టర్ తాళాలు పగులగొట్టిన ఆగంతకులు లోపలికి ప్రవేశించారు. క్యాష్‌బాక్స్‌లోని రూ.2 వేలను అపహరించుకపోయినట్టు దుకాణ యజమాని చావల్‌సింగ్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. విశాఖ నుంచి క్లూస్‌టీంను రప్పించి ఆగంతకుల వేలిముద్రలను సేకరించారు. ఎస్‌ఐ లక్ష్మీనారా యణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.