సినిమా అవకాశం అంటూ రూ.5 లక్షలకు టోకరా

ABN , First Publish Date - 2020-06-18T09:34:29+05:30 IST

సినిమాలో డ్యాన్సర్‌ అవకాశం ఇప్పిస్తామని చెప్పి ఓ

సినిమా అవకాశం అంటూ రూ.5 లక్షలకు టోకరా

ఏసీపీకి ఫిర్యాదు చేసిన బాధితురాలు


తాటిచెట్లపాలెం, జూన్‌ 17:సినిమాలో డ్యాన్సర్‌ అవకాశం ఇప్పిస్తామని చెప్పి ఓ యువతి నుంచి రూ.5 లక్షలు వసూలు bచేసిన ఘరానా మోసగాళ్ల ఉదంతమిది. తాను మోసపోయానని గుర్తించిన బాధితురాలు కంచరపాలెం పోలీస్‌ స్టేషన్‌ తనిఖీకి వచ్చిన ఏసీపీ స్వరూపారాణికి  బుధవారం ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం మేరకు... మురళీనగర్‌ ఎన్‌జీజీఓస్‌ కాలనీకి చెందిన బత్తుల ప్రభావతికి సినిమాల్లో నటించాలన్నది కోరిక. దీన్ని గమనించిన నగరానికి చెందిన బొమ్మిడి గీతాప్రసాద్‌, సత్యనారాయణ, షరీఫ్‌లు ఆమెను సంప్రదించారు. తమకు సినీ వర్గాలతో పరిచయాలున్నాయని, ఐటమ్‌సాంగ్‌లో నటించే అవకాశం వచ్చేలా చేస్తామని చెప్పారు. ఐటమ్‌సాంగ్‌లో నటిస్తే రూ.10 లక్షలు ఇస్తారని, అందులో రూ.5 లక్షలు తమకు ముందే ఇవ్వాలని షరతు పెట్టారు.


ఇది నిజమని నమ్మిన ప్రభావతి రూ.5 లక్షలు ముట్టజెప్పింది. ఎప్పటికీ అవకాశం రాకపోగా, సదరు వ్యక్తులు ముఖం చాటేసి తిరుగుతుండడంతో మోసపోయానని గుర్తించి కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే సమయంలో స్టేషన్‌లోని పెండింగ్‌ కేసుల పరిశీలనకు వెస్ట్‌జోన్‌ సబ్‌డివిజన్‌ ఏసీపీ జి.స్వరూపారాణి రావడంతో ఆమెను కలిసి బాధితురాలు తన గోడు వినిపించుకుంది. దీనిపై స్పందించిన ఏసీపీ తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. 

Updated Date - 2020-06-18T09:34:29+05:30 IST