కొండవాగులో గిరిజనుడు గల్లంతు

ABN , First Publish Date - 2020-08-22T11:26:44+05:30 IST

యు.చీడిపాలెం శివారు నీలవరం గ్రామానికి చెందిన పంపా మంగ్ల (40) పలకజీడి సమీప కొండకాలువ దాటుతూ కొట్టుకుపోయాడు. ఈమేరకు కుటుంబీకులు, మాజీ సర్పంచ్‌ చంద్రకళ అందించిన

కొండవాగులో గిరిజనుడు గల్లంతు

కొండవాగులో గిరిజనుడు గల్లంతు

కొయ్యూరు, ఆగస్టు 21: యు.చీడిపాలెం శివారు నీలవరం గ్రామానికి చెందిన పంపా మంగ్ల (40) పలకజీడి సమీప కొండకాలువ దాటుతూ కొట్టుకుపోయాడు. ఈమేరకు కుటుంబీకులు, మాజీ సర్పంచ్‌ చంద్రకళ అందించిన వివరాలిలా ఉన్నాయి. గురువారం సాయంత్రం నిత్యావసర సరుకుల నిమిత్తం నీలవరం నుంచి పలకజీడి వచ్చిన మంగ్ల తిరుగు ప్రయాణంలో కొండకాలువ దాటుతూ ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయాడు.


విషయాన్ని తెలుసుకున్న వెంటనే కుటుంబీకులు, గ్రామస్థులు అతని ఆచూకీ కోసం కాలువలో గాలించినా ఫలితం లేకపోయింది. శుక్రవారం ఉదయం నుంచి మంగ్ల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మంగ్లకు భార్య చంద్రమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

Updated Date - 2020-08-22T11:26:44+05:30 IST