మహోన్నత వ్యక్తి నందమూరి

ABN , First Publish Date - 2020-05-29T09:40:45+05:30 IST

తెలుగుజాతి ఆత్మ గౌరవాన్ని, ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహానేత నందమూరి తారకరామారావు అ..

మహోన్నత వ్యక్తి నందమూరి

టీడీపీ నగర అధ్యక్షుడు వాసుపల్లి 

ఎన్టీఆర్‌ భవన్‌లో ఘన నివాళి అర్పించిన నేతలు 


మహారాణిపేట, మే 28: తెలుగుజాతి ఆత్మ గౌరవాన్ని, ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహానేత నందమూరి తారకరామారావు అని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు, ఎమ్మెల్యే వాసుపలి ్లగణేష్‌ కుమార్‌ అన్నారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఎన్టీఆర్‌ భవన్‌లో గురువారం నేతలు భౌతిక దూరం పాటిస్తూ  ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.


ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నేత ఎన్టీఆర్‌ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మహ్మద్‌ నజీర్‌, జిల్లా కార్యదర్శి పట్టాభి, ఉపాధ్యక్షులు నక్కా కనకరాజు, పోతనరెడ్డి, వార్డు అధ్యక్షులు, ఎన్టీఆర్‌ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.  

Updated Date - 2020-05-29T09:40:45+05:30 IST