కాఫీకి మద్దతు ధర ప్రకటించాలి
ABN , First Publish Date - 2020-12-14T05:29:41+05:30 IST
గిరి రైతులు పండించిన కాఫీకి ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి, రైతుల నుంచి కొనుగోలు చేయాలని తెలుగుదేశం సీనియర్ నాయకుడు సియ్యారి దొన్నుదొర డిమాండ్ చేశారు.

టీడీపీ సీనియర్ నాయకుడు సియ్యారి దొన్నుదొర
అరకులోయ, డిసెంబరు 13: గిరి రైతులు పండించిన కాఫీకి ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి, రైతుల నుంచి కొనుగోలు చేయాలని తెలుగుదేశం సీనియర్ నాయకుడు సియ్యారి దొన్నుదొర డిమాండ్ చేశారు. ఆదివారం దొరవలసలో కాఫీ రైతులతో మాజీ సర్పంచ్ సమర్ది రఘనాథ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాఫీ, మిరియాలకు మద్దతు ధర నేటి వరకు ప్రకటించకపోవడం సమంజసంగా లేదన్నారు. మద్దతుధర ప్రకటించి జీసీసీ ద్వారా గానీ, రైతు భరోసా కేంద్రాల ద్వారా గానీ కొనుగోలు చేయాలన్నారు. గత ఏడాది జీసీసీ కొనుగోలు చేసిన కాఫీకి రెండవ విడత బకాయిలు చెల్లించాలని కోరారు. అరకు కాఫీకి అంతర్జాతీ ఖ్యాతిని చంద్రబాబునాయుడు తీసుకువచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు కుమార్, యువజన సంఘం నాయకుడు పి.దాసు, నాగరాజు, రైతులు పాల్గొన్నారు.