ప్రజల భద్రతే ప్రభుత్వానికి ముఖ్యం

ABN , First Publish Date - 2020-05-10T06:47:28+05:30 IST

ప్రజా సంక్షేమం, భద్రత మాత్రమే ప్రభుత్వానికి ముఖ్యమని, కంపెనీ కాదని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు.

ప్రజల భద్రతే ప్రభుత్వానికి ముఖ్యం

జిల్లా ఇన్‌చార్జి మంత్రి కన్నబాబు 


సిరిపురం: ప్రజా సంక్షేమం, భద్రత మాత్రమే ప్రభుత్వానికి ముఖ్యమని, కంపెనీ కాదని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీక్‌ తగ్గిందని, ప్రస్తుతానికి పూర్తిస్థాయిలో అదుపులో ఉందన్నారు. శనివారం రాత్రి మంత్రులు బొత్స సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాసు, జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌లతో కలిసి కన్నబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లీకేజీ ప్రభావం నుంచి ఆ ప్రాంతం కోలుకుంటుందన్నారు. గాలిలో కలిసిన గ్యాస్‌ ప్రభావం తగ్గుతుందన్నారు. స్టోరేజీ పాయింట్‌ వద్ద  ఉష్ణోగ్రతలు వేగంగా తగ్గుతున్నాయని తెలిపారు. ఐదు గ్రామాల ప్రజలను తిరిగి వారి ఇళ్లకు క్షేమంగా పంపడానికి ఆలోచిస్తున్నామన్నారు. సంఘటనపై కమిటీలను వేశామని, నివేదిక రాగానే కంపెనీపై  చర్య తీసుకుంటామన్నారు. 

Updated Date - 2020-05-10T06:47:28+05:30 IST