మాస్క్‌ల కోసం పీజీ వైద్యుల క్యూ

ABN , First Publish Date - 2020-04-07T11:40:30+05:30 IST

నగరంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులకు అవసరమైనన్ని మాస్క్‌లు సరఫరా కావడం లేదు.

మాస్క్‌ల కోసం పీజీ వైద్యుల క్యూ

విశాఖపట్నం, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): నగరంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులకు అవసరమైనన్ని మాస్క్‌లు సరఫరా కావడం లేదు. దాంతో వారు దాతలపై ఆధార పడుతున్నారు. ఏపీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఇండస్ట్రీ ఫెడరేషన్‌ ప్రతినిధులు నరేశ్‌కుమార్‌, డీఎస్‌ వర్మలు సోమవారం కేజీహెచ్‌ ఆవరణలో వైద్యులకు మాస్క్‌లు ఉచితంగా పంపిణీ చేశారు. వాటి కోసం పీజీ డాక్టర్లు క్యూలో నిలుచుని మరీ తీసుకున్నారు. తమకు ప్రభుత్వం నుంచి సరఫరా లేదని, విధి నిర్వహణలో మాస్క్‌ తప్పనిసరి కావడం, బయట నాణ్యమైనవి దొరక్కపోవడం వల్ల ఇలాంటి దాతలపై ఆధారపడుతున్నామని పీజీ వైద్యులు తెలిపారు. 

Read more