-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » The offended person committed suicide
-
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-12-28T05:04:12+05:30 IST
దీర్ఘకాలిక వ్యాధితో బాధ పడుతున్న ఓ వ్యక్తి మనస్తాపంతో ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు.

తాటిచెట్లపాలెం, డిసెంబరు 27: దీర్ఘకాలిక వ్యాధితో బాధ పడుతున్న ఓ వ్యక్తి మనస్తాపంతో ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎయిర్‌పోర్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎన్‌ఏడీ సమీపంలోని సాకేతపురంలో ఉంటున్న నేమాని శరత్ చంద్రమౌళి (39) ఇంటర్ వరకు చదువుకున్నాడు. కరోనా కారణంగా ఉపాధి లేక ఇంటి వద్దే ఉంటున్నాడు. దీనికితోడు మూర్చవ్యాధితో బాధ పడుతున్నాడు. ఈ నేపథ్యంలో జీవితంపై విరక్తి చెంది ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు సోదరుడు సుందరరామయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.