పెంచిన విద్యుత్ చార్జీలు రద్దు చేయాల్సిందే
ABN , First Publish Date - 2020-05-19T08:07:22+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచిన విద్యుత్ చార్జీలు తక్షణమే రద్దు చేయాలని, కొత్త టారిఫ్ విధానం నిలిపివేయాలని

వామపక్షాల డిమాండ్
సీపీఎం కార్యాలయంలో ధర్నా
జగదాంబసెంటర్, మే 18: రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచిన విద్యుత్ చార్జీలు తక్షణమే రద్దు చేయాలని, కొత్త టారిఫ్ విధానం నిలిపివేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్.నరసింగరావు డిమాండ్ చేశారు. విద్యుత్ చార్జీల పెంపుపై వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం జగదాంబ ఎల్లమ్మతోటలో ఉన్న ిసీపీఎం జిల్లా కార్యాలయం వద్ద విద్యుత్ బిల్లు భారీ కటౌట్ ఏర్పాటు చేసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ లాక్‌డౌన్‌తో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున కరెంటు బిల్లులు మూడు నెలలు చెల్లించకున్నా విద్యుత్ సరఫరా చేస్తామని ప్రభుత్వం చెప్పిందని గుర్తుచేశారు. వైసీపీ ప్రభుత్వం దొంగచాటుగా ఏప్రిల్ 1 నుంచి కొత్త టారిఫ్‌ను అమలు చేయడం దుర్మార్గమన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జేవీ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఎన్నడూలేని విధంగా ఈ ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ భారం మోపిందన్నారు. పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా, నగర కార్యదర్శులు కె.లోకనాఽథం, డాక్టర్ బి.గంగారావు, సీపీఐ నగర కార్యదర్శి ఎం.పైడిరాజు, సీపీఐ ఎంఎల్(న్యూడెమోక్రసీ) జిల్లా కార్యదర్శి వై.కొండయ్య, గణేష్ పాండా తదితరులు పాల్గొన్నారు.