రైతులపై వైసీపీ నాయకుల కపట ప్రేమ

ABN , First Publish Date - 2020-12-13T06:06:03+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఉద్యమం పట్ల వైసీపీ నాయకులు కపట ప్రేమ ప్రదర్శిస్తున్నరని అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు విమర్శించారు.

రైతులపై వైసీపీ నాయకుల కపట ప్రేమ

ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్‌

అనకాపల్లి, డిసెంబరు 12: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఉద్యమం పట్ల వైసీపీ నాయకులు కపట ప్రేమ ప్రదర్శిస్తున్నరని అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు విమర్శించారు. జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్ర రైతాంగానికి నిరాశ, నిస్పృహలు తప్ప మరేమీ లేదన్నారు. వరుస తుఫాన్లతో రాష్ట్రంలో లక్షలాది ఎక్షరాల్లో పంటలు నాశనమై రైతులు అవస్థలు పడుతుంటే, కనీసం పంట బీమా కట్టకపోవడం దారుణమన్నారు. రైతు సంక్షేమం గురించి ఆలోచిస్తే వ్యవసాయ మోటార్లకు విద్యుత్‌ మీటర్లు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో సమాధానం చెప్పాలని జగదీశ్‌ డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-12-13T06:06:03+05:30 IST