-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » The greatest danger missed
-
తప్పిన పెను ప్రమాదం
ABN , First Publish Date - 2020-12-31T05:01:10+05:30 IST
జాతీయ రహదారి లంకెలపాలెం కూడలిలో బుధవారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో ఓ లారీ అదుపు తప్పి దూసుకుపోయింది.

లంకెలపాలెం: జాతీయ రహదారి లంకెలపాలెం కూడలిలో బుధవారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో ఓ లారీ అదుపు తప్పి దూసుకుపోయింది. ఈప్రమాదంలో ఓవ్యక్తి తీవ్రంగా గాయపడగా, కారు, బస్సు దెబ్బతిన్నాయి. పరవాడ పోలీసులు తెలిపిన వివరాలిలావున్నాయి. గాజువాక నుంచి అనకాపల్లి వస్తున్న లారీ లంకెలపాలెం కూడలికి వచ్చేసరికి బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. కూడలిలో రెడ్ సిగ్నల్ పడడంతో ఆగి ఉన్న కారు, బస్సు, దిచక్ర వాహనంపైకి లారీ దూసుకువచ్చింది. ప్రమాదంలో పెదముషిడివాడకి చెందిన ద్విచక్ర వాహన చోదకుడు ఒమ్మి అశోక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కారు, బస్సు దెబ్బ తిన్నాయి. కూడలిలో ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ ఎస్‌ఐ రామకృష్ణ అశోక్‌ను ఆస్పత్రికి తరలించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. పరవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.