ఆర్‌బీకేల్లో గోనెలు అందుబాటులో ఉంచాలి

ABN , First Publish Date - 2020-12-28T04:59:38+05:30 IST

రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు గోనె సంచులను అందుబాటులో ఉంచాలని తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు జూరెడ్డి రాము అన్నారు.

ఆర్‌బీకేల్లో గోనెలు అందుబాటులో ఉంచాలి


తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు జూరెడ్డి రాము


కె.కోటపాడు, డిసెంబరు 27: రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు గోనె సంచులను అందుబాటులో ఉంచాలని తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు జూరెడ్డి రాము అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ.. గోనె సంచులు అందుబాటులో లేకపోవడంతో రైతులు మిల్లర్ల వద్దకు తిరగలేకపోతున్నారన్నారు. ప్రభుత్వం గోనె సంచులను అప్పగించి మిల్లర్లకు మేలు చేస్తుందన్నారు. గోనె సంచులు లేకపోవడంతో రైతులు ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని అమ్మలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. దీంతో దళారులు ప్రభుత్వ ధర కంటే తక్కువగా రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే గోనెసంచులు ఉచితంగా అందజేసేవారన్నారు.  అధికారులు స్పందించి రైతు భరోసా కేంద్రాల్లోనే గోనెసంచులు రైతులకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2020-12-28T04:59:38+05:30 IST