-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » The former glory of the flower garden
-
అప్పన్న పూదోటకు పూర్వ వైభవం
ABN , First Publish Date - 2020-12-11T04:42:34+05:30 IST
దశాబ్దాల చరిత్ర కలిగిన సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి పూదోటకు పూర్వవైభవం తీసుకురావడంలో పాలకమండలి సభ్యులు, అధికారులు, సిబ్బంది, భక్తులు భాగస్వాములు కావాలని విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి ఆకాంక్షించారు.

సింహాచలం, డిసెంబరు 10: దశాబ్దాల చరిత్ర కలిగిన సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి పూదోటకు పూర్వవైభవం తీసుకురావడంలో పాలకమండలి సభ్యులు, అధికారులు, సిబ్బంది, భక్తులు భాగస్వాములు కావాలని విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి ఆకాంక్షించారు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా దేవస్థానం పాలకమండలి చేపట్టిన మొక్కల నాటే కార్యక్రమం లో భాగంగా స్వామీజీ గురువారం తొలిమొక్కనాటి శ్రీకారం చుట్టారు. అనంతరం అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్, ఉత్తర నియోజకవర్గ వైసీపీ నేత కేకే రాజు, పాలకమండలి సభ్యులు, దేవస్థానం అధికారులు, భక్తులు మొక్కలను నాటారు.