సొంతింటి కల నెరవేరింది

ABN , First Publish Date - 2020-12-29T05:31:56+05:30 IST

పేదల సొంతింటి కల నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికే దక్కిందని ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడు అన్నారు.

సొంతింటి కల నెరవేరింది
సమావేశంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ ముత్యాలనాయుడు



ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడు


దేవరాపల్లి, డిసెంబరు 28: పేదల సొంతింటి కల నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికే దక్కిందని ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడు అన్నారు. సోమవారం మండలకేంద్రంలో 500 మందికి ఇళ్ల స్థలాల పట్టాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ కాలనీకి వైఎస్‌ఆర్‌ నగర్‌గా పేరు పెట్టి.. పాఠశాల, కాలువలు, తాగునీరు, రోడ్లు, కాలువలు, విద్యుత్‌ సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకాధికారి అనిత, మాజీఎంపీపీ కిలపర్తి భాస్కరరావు, ఎంపీడీఓ సుబ్బలక్ష్మి, హౌసింగ్‌ ఏఈఈ లెక్కల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-29T05:31:56+05:30 IST