గెడ్డలో మునిగి గిరి బాలుడి మృతి

ABN , First Publish Date - 2020-03-12T07:39:17+05:30 IST

గెడ్డలో స్నానానికి వెళ్లిన ఓ బాలుడు నీట మునిగి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హుకుంపేట మండల

గెడ్డలో మునిగి గిరి బాలుడి మృతి

హుకుంపేట, మార్చి 11: గెడ్డలో స్నానానికి వెళ్లిన ఓ బాలుడు నీట మునిగి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హుకుంపేట మండల కేంద్రానికి చెందిన కోడా సుందరమ్మ కుమారుడు సోమేష్‌ కుమార్‌ (10) బుధవారం హుకుంపేట శివారులో ఉన్న చీడిపుట్టు గెడ్డ వద్ద స్నానం చేసేందుకు వెళ్లాడు. స్నానం చేస్తున్న క్రమంలో గెడ్డలో మునిగిపోయాడు. ఈ ఘటనకు చేపలు పడుతున్న వ్యక్తులు గమనించి అడ్డుమండ రహదారిలో వెళ్లే వారికి చెప్పారు. విషయం తెలియగానే కుటుంబీకులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం 5 గంటల సమయంలో మృతదేహాన్ని వెలికితీశారు. ఈ విషయమై ఎస్‌ఐ అప్పలనాయుడుకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం చేసిన అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. కాగా, గతంలోనూ ఈ గెడ్డలో మండల కేంద్రానికి చెందిన ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. సంబంధిత అధికారులు స్పందించి ఈ గెడ్డ వద్ద ఇసుక తవ్వకాలు లేకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - 2020-03-12T07:39:17+05:30 IST