సెల్‌ఫోన్‌ కొనలేదని బాలుడు ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-12-27T04:58:47+05:30 IST

సెల్‌ ఫోన్‌ కొనలేదని మనస్థాపానికి గురై ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని పులపర్తిలో శనివారం చోటుచేసుకుంది.

సెల్‌ఫోన్‌ కొనలేదని బాలుడు ఆత్మహత్య
మృతి చెందిన లక్ష్మణ్‌ దివాకర్‌ (ఫైల్‌)

  ఎలమంచిలి రూరల్‌, డిసెంబరు 26 : సెల్‌ ఫోన్‌ కొనలేదని మనస్థాపానికి గురై ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని పులపర్తిలో శనివారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి హెచ్‌సీ శ్యామ్‌త్రినాథరావు తెలిపిన వివరాలివి. పులపర్తిలో ఉంటున్న శియ్యాదుల రాము, జోగిరత్నం దంపతులకు ఇంటర్‌ చదువుతున్న గణపతి, పాలిటెక్నిక్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్న లక్ష్మణ్‌దివాకర్‌ (16) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో చిన్నవాడైన లక్ష్మణ్‌ దివాకర్‌ తన స్నేహితులందరికీ సెల్‌ఫోన్లు ఉన్నాయని, తనకు కూడా కొని ఇవ్వాలని తల్లిదండ్రులను కోరాడు. ఇందుకు వారు అంగీకరించక పోవడంతో మనస్థాపానికి గురైన ఇంట్లో ఎవరూ లేని సమ యంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు హెచ్‌సీ చెప్పారు. 


Updated Date - 2020-12-27T04:58:47+05:30 IST