నేడు ఉప రాష్ట్రపతి రాక

ABN , First Publish Date - 2020-12-07T05:46:03+05:30 IST

భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం నగరానికి రానున్నారు. ప్రత్యేక విమానంలో చెన్నై నుంచి ఉదయం 10:25 నిమిషాలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.

నేడు ఉప రాష్ట్రపతి రాక
venkayya naidu

చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ చేరనున్న వెంకయ్యనాయుడు

13వ తేదీ వరకు నగరంలోనే బస


విశాఖపట్నం, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం నగరానికి రానున్నారు. ప్రత్యేక విమానంలో చెన్నై నుంచి ఉదయం 10:25 నిమిషాలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి బీచ్‌రోడ్‌లో గల ’ సెంట్రల్‌ మెరైన్‌ ఫిషింగ్‌ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌ (సీఎంఎఫ్‌ఆర్‌ఐ)ను సందర్శించి శాస్త్రవేత్తలు, అధికారులను కలుసుకుని అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30 గంటలకు సాగర్‌నగర్‌ వెళతారు. రాత్రి రుషికొండ హరిత రిసార్ట్స్‌లో ఏర్పాటు చేసిన విందులో పాల్గొంటారు. అనంతరం సాగర్‌నగర్‌లో బస చేసి, మంగళవారం నుంచి పలు కార్యక్రమాల్లో వర్చువల్‌ సమావేశాల ద్వారా పాల్గొంటారని అధికారులు తెలిపారు. తిరిగి ఈ నెల 13వ తేదీ ఉదయం 7:45 నిమిషాలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళతారని తెలిపారు. కాగా ఉప రాష్ట్రపతి కాన్వాయ్‌లో డ్రైవర్లు, సిబ్బంది, భద్రతా సిబ్బందికి ఆదివారం పోలీస్‌ బ్యారెక్స్‌లో కరోనా పరీక్షలు నిర్వహించారు. 


Updated Date - 2020-12-07T05:46:03+05:30 IST