తూటిపాల భూములపై తహసీల్దార్‌ విచారణ

ABN , First Publish Date - 2020-11-25T06:48:40+05:30 IST

తూటిపాలలో సర్వే నంబరు 210లో ఉన్న 76.55 ఎకరాల భూమిపై తహసీల్దార్‌ రాణి అమ్మాజీ విచారణ చేపట్టారు.

తూటిపాల భూములపై తహసీల్దార్‌ విచారణ
రైతుల నుంచి వివరాలు తీసుకుంటున్న తహసీల్దార్‌

మాకవరపాలెం, నవంబరు 24: తూటిపాలలో సర్వే నంబరు 210లో ఉన్న 76.55 ఎకరాల భూమిపై తహసీల్దార్‌ రాణి అమ్మాజీ విచారణ చేపట్టారు. ఈ భూములపై ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన వరుస కథనాలకు ఉన్నతాధికారులు స్పందించి రెవెన్యూ అధికారులను విచారణకు ఆదేశించారు. ఈ మేరకు తహసీల్దార్‌ గ్రామసభలో విచారణ నిర్వహించారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని తహసీల్దార్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో డీటీ చైన్లు, ఆర్‌ఐ నరేంద్ర, వీఆర్వో అప్పారావు పాల్గొన్నారు.

Read more