దేవాలయాలను సందర్శించిన గుడికో గోమాత కమిటీ

ABN , First Publish Date - 2020-11-04T05:13:37+05:30 IST

జిల్లాలోని రెండు దేవాలయాలను మంగళవారం తిరుమల తిరుపతి దేవస్థానం గుడికో గోమాత కమిటీ ప్రతినిధులు సందర్శించారు.

దేవాలయాలను సందర్శించిన గుడికో గోమాత కమిటీ
దాకమర్రిలోని ఆలయ ఆవరణలో కమిటీ ప్రతినిధులు

ఎంవీపీ కాలనీ, నవంబరు 3: జిల్లాలోని రెండు దేవాలయాలను మంగళవారం తిరుమల తిరుపతి దేవస్థానం గుడికో గోమాత కమిటీ ప్రతినిధులు సందర్శించారు. టీటీడీ గుడికో గోమాత పరిశీలన కమిటీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సుమన్‌కుమార్‌, సూపరింటెండెంట్లు వెంకటరమణ, క్రాంతికుమార్‌, ప్రతినిధి శ్రీనుబాబులు భీమిలి మండలంలోని దాకమర్రిలోని లక్ష్మీవల్లభ నారాయణస్వామి దేవాలయంతో పాటు రాంబిల్లిలోని అయోధ్య సత్య రామాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సుమన్‌ కుమార్‌ మాట్లాడుతూ గుడికో గోమాత పథకం కింద పైలెట్‌ ప్రాజెక్టుగా జిల్లాలోని ఈ రెండు దేవాలయాలను ఎంపిక చేశామన్నారు. అలాగే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కో దేవాలయాన్ని ఈ పథకానికి ఎంపిక చేశామన్నారు. ఎంపిక చేసిన దేవాలయాలకు ఒక్కో గోవును అందజేస్తామని, వీటి ఆలన, పాలన ఆ ఆలయాలే చూసుకుంటాయన్నారు. ఈ గోవులకు భక్తులు పూజలు చేసేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

Updated Date - 2020-11-04T05:13:37+05:30 IST