-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Temple rush
-
ఉపమాక వెంకన్న ఆలయానికి భక్తుల తాకిడి
ABN , First Publish Date - 2020-12-06T06:14:09+05:30 IST
ప్రముఖ పుణ్యక్షేత్రం ఉప మాక వేంకటేశ్వరస్వామి ఆలయం శనివారం భక్తులతో సందడిగా మారింది.

నక్కపల్లి, డిసెంబరు 5 : ప్రముఖ పుణ్యక్షేత్రం ఉప మాక వేంకటేశ్వరస్వామి ఆలయం శనివారం భక్తులతో సందడిగా మారింది. ఉత్తరాంధ్రలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో విచ్చేశారు. వేకువజామున కొండపై ఉన్న స్వామివారి మూలవిరాట్‌కు అభిషేకాలు జరి పారు. భక్తులందరికీ రాజగోపురం వద్ద ఆలయ సిబ్బంది శానిటైజర్ చేశారు. అర్చకులు ప్రసాదాచార్యులు, శేషాచార్యులు, రంగా, సాయి పూజా కార్యక్రమాలు జరిపారు. ఇదిలా వుంటే, స్వామి దర్శనానికి వచ్చిన వారికి ఆలయ మాజీ చైర్మన్ పెంకులరాజు సహకారంతో అన్నదానం చేశారు.