పది నిమిషాల్లోనే రైస్‌ కార్డు

ABN , First Publish Date - 2020-09-25T11:38:46+05:30 IST

స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో గురువారం బియ్యం కార్డును పది నిమిషాల్లో లబ్ధిదారుడికి అందించారు.

పది నిమిషాల్లోనే రైస్‌ కార్డు

లబ్ధిదారుడికి అందించిన తహసీల్దార్‌ ప్రకాశరావు


పాడేరురూరల్‌, సెప్టెంబరు 24: స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో గురువారం బియ్యం కార్డును పది నిమిషాల్లో లబ్ధిదారుడికి అందించారు. మండలంలోని సలుగు పంచాయతీ రంగసింగిపాడు గ్రామానికి చెందిన పాంగి చిలుకునాయుడు, కుమారి తమకు బియ్యం కార్డు లేదని తహసీల్దార్‌ వి. ప్రకాశరావు వద్ద వాపోయారు. దీంతో వారి కుటుంబం ఆధార్‌ కార్డులు తీసుకొని అప్‌లోడ్‌ చేయించి పది నిమిషాల్లోనే బియ్యం కార్డును అందజేశారు.   ఈ కార్యక్రమంలో డీటీ ప్రసన్నకుమార్‌, ఆర్‌ఐలు వెంకటరమణ, కిరణ్‌, వీఆర్‌వోలు రామజోగారావు, వెంకటలక్ష్మి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-09-25T11:38:46+05:30 IST