టీడీపీ అభ్యర్థుల విజయానికి సమష్టి కృషి

ABN , First Publish Date - 2020-03-15T11:45:56+05:30 IST

జీవీఎంసీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయం కోసం సమష్టిగా పనిచేయాలని పార్టీ నేతలు నిర్ణయించారు. శనివారం

టీడీపీ అభ్యర్థుల విజయానికి సమష్టి కృషి

విశాఖపట్నం, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): జీవీఎంసీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయం కోసం సమష్టిగా పనిచేయాలని పార్టీ నేతలు నిర్ణయించారు. శనివారం ఉదయం విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇంట్లో పార్టీ నేతలు సమావేశమయ్యారు. నామినేషన్ల గడువు ముగిసినందున ఇంకా అభ్యర్థుల ఖరారు పూర్తిచేసి ప్రచారంపై దృష్టి సారించాలన్నారు. మేయరు అభ్యర్థి విషయంపై కూడా చర్చించారు. మేయరు అభ్యర్థి రేసులో ఉన్న పీలా శ్రీనివాసరావును నాయకులు అభినందించారు. ఈ భేటీకి పార్టీ పరిశీలకుడు గన్ని కృష్ణ, అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్‌, ఇంకా బండారు సత్యనారాయణమూర్తి, పీలా గోవిందు, బండారు అప్పలనాయుడు తదితరులు హాజరయ్యారు. 

Updated Date - 2020-03-15T11:45:56+05:30 IST