ప్రత్యేక పద్ధతుల్లో బోధన అవసరం: డీఈవో
ABN , First Publish Date - 2020-12-17T06:17:32+05:30 IST
దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక పద్ధ తుల్లో బోధించాలని డీఈవో లింగేశ్వరరెడ్డి పేర్కొన్నారు.

పెందుర్తి, డిసెంబరు 16: దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక పద్ధ తుల్లో బోధించాలని డీఈవో లింగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. పెందుర్తి టీటీడీసీలో బుధవారం సమగ్ర శిక్ష ఆధ్వ ర్యంలో జిల్లా సహిత విద్యా రిసోర్సు పర్సన్లకు దివ్యాంగ విద్యార్థులకు బోధన నైపుణ్యాల సహిత విద్యా వృత్యంతర శిక్షణ శిబిరానికి హాజరైన డీఈవో మాట్లాడుతూ దివ్యాంగుల బోధనలో సృజనాత్మకత ప్రదర్శించాలన్నారు. జిల్లా ప్రణాళిక సమన్వయకర్త సత్యప్రసాద్ మాట్లాడుతూ సహిత విద్యా బోధకులు ప్రేరణ అంశాలతో బోధించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సహిత విద్య సమన్వయకర్త సంతోశ్‌కుమార్, సహాయక సమన్వయకర్త శైలజ, తదితరులు పాల్గొన్నారు.