బదిలీల తీరుపై టీచర్ల ఆగ్రహం

ABN , First Publish Date - 2020-12-25T06:09:21+05:30 IST

బదిలీల తీరుపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

బదిలీల తీరుపై టీచర్ల ఆగ్రహం
బుచ్చెయ్యపేట ఎంఈఓ కార్యాలయం వద్ద ఆందోళన

 విశాఖపట్నం, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి):


బదిలీల తీరుపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎస్‌జీటీల బదిలీల కౌన్సెలింగ్‌ మాన్యువల్‌గా జరపాలని, బ్లాక్‌ చేసిన ఖాళీలన్నింటినీ బహిర్గతం చేయాలని, చైల్డ్‌ ఇన్ఫో వల్ల కోల్పోయిన పోస్టులను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని మండలాల్లో ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. వెబ్‌ కౌన్సెలింగ్‌ వల్ల తమకు అన్యాయం జరుగుతుందని మొత్తుకుంటున్నా...ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం ఎంఈవోలకు వినతిపత్రాలు అందజేశారు.

Updated Date - 2020-12-25T06:09:21+05:30 IST