ఉపాధ్యాయులకు నైపుణ్య శిక్షణ
ABN , First Publish Date - 2020-11-27T04:53:50+05:30 IST
జీవీఎంసీ పాఠశాలల్లో బోధిస్తున్న ఉపాధ్యాయులకు ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్ స్కిల్స్‌పై నెలరోజులపాటు జరగనున్న శిక్షణ కార్యక్రమం విశాఖ నగరంలోని ఆర్పీపేట ప్రాథమిక పాఠశాలలో గురువారం ప్రారంభమైంది.

కంచరపాలెం : జీవీఎంసీ పాఠశాలల్లో బోధిస్తున్న ఉపాధ్యాయులకు ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్ స్కిల్స్‌పై నెలరోజులపాటు జరగనున్న శిక్షణ కార్యక్రమం విశాఖ నగరంలోని ఆర్పీపేట ప్రాథమిక పాఠశాలలో గురువారం ప్రారంభమైంది. కేంబ్రిడ్జి యూనివర్సిటీ సహకారంతో ఎంఏ అండ్ యూడీ ప్రోత్సాహంతో ఈ శిక్షణ అందజేస్తున్నారు. నెలరోజులపాటు జరగనున్న శిక్షణలో ప్రతిరోజు ఉదయం ఆఫ్‌లైన్, మధ్యాహ్నం ఆన్లైన్ శిక్షణ తరగతులు జరగనున్నాయి. గ్రేటర్ స్కూల్స్ సూపర్వైజర్ ఎస్.దొరబాబు గురువారం శిక్షణ కేంద్రాన్ని సందర్శించి వృత్తి శిక్షణ ప్రాధాన్యతను ఉపాధ్యాయులకు వివరించారు. కార్యక్రమంలో ఆర్పీపేట ప్రాథమిక పాఠశాల హెచ్ఎం టి.శ్రీనివాసరావు, ఆర్పీ హరికిరణ్ పాల్గొన్నారు.