వార్డు కమిటీలను ఏర్పాటు చేయండి

ABN , First Publish Date - 2020-12-14T04:46:25+05:30 IST

విశాఖ ఉత్తర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.

వార్డు కమిటీలను ఏర్పాటు చేయండి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

ఎంవీపీ కాలనీ, డిసెంబరు 13: విశాఖ ఉత్తర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదివారం ఎంవీపీ కాలనీలోని తన నివాసంలో విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి గంటా సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతం, అధిష్టాన వర్గం ఇచ్చిన పిలుపు మేరకు విధిగా కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో నియోజకవర్గం ఇన్‌చార్జి విజయ్‌బాబు, సమన్వయ కమిటీ సభ్యులు, ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-14T04:46:25+05:30 IST