అన్నగా అండగా ఉంటా...విశాఖ బాలికకు లోకేష్ హామీ

ABN , First Publish Date - 2020-10-07T18:08:05+05:30 IST

అన్నగా అండగా ఉంటానంటూ విశాఖ మైనర్ బాలికకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు.

అన్నగా అండగా ఉంటా...విశాఖ బాలికకు లోకేష్ హామీ

విశాఖపట్నం: అన్నగా అండగా ఉంటానంటూ విశాఖ మైనర్ బాలికకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. గాజువాక వాంబే కాలనీలో మైనర్ బాలికపై పాస్టర్ అత్యాచారయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. తల్లి చనిపోవడంతో మేనత్త సంరక్షణలో బాలిక ఉంటోంది. విషయం తెలిసిన వెంటనే బాధిత బాలిక తండ్రి, మేనత్తతో లోకేష్ ఫోన్లో మాట్లాడారు. బాలికకు అన్నలా అండగా ఉంటా అని హామీ ఇచ్చారు.  బాలిక చదువు బాధ్యత తీసుకుంటానంటూ భరోసా ఇచ్చారు. బాలికపై అత్యాచారానికి ప్రయత్నించిన వ్యక్తికి  శిక్ష పడేలా కుటుంబం చేస్తున్న పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందని లోకేష్ హామీ ఇచ్చారు. 

Read more