టీడీపీ నేత సింహాచలంనాయుడు మృతి

ABN , First Publish Date - 2020-11-04T04:30:23+05:30 IST

మండలంలోని మామిడిపల్లికి చెందిన తెలుగుదేశం సీనియర్‌ నాయకుడు పూడి.సింహాచలంనాయుడు(70) అనారోగ్యంతో మంగళవారం విశాఖపట్నంలోని కిమ్స్‌ ఆస్పత్రిలో మృతి చెందారు.

టీడీపీ నేత సింహాచలంనాయుడు మృతి
పూడి సింహాచలంనాయుడు(పైల్‌)

దేవరాపల్లి, నవంబరు 3: మండలంలోని మామిడిపల్లికి చెందిన తెలుగుదేశం సీనియర్‌ నాయకుడు పూడి.సింహాచలంనాయుడు(70) అనారోగ్యంతో మంగళవారం విశాఖపట్నంలోని కిమ్స్‌ ఆస్పత్రిలో మృతి చెందారు. ఆగస్టులో కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్న సింహాచలంనాయుడు బ్రెయిన్‌పై తీవ్రమైన ప్రభావం చూపడంతో ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. గతనెల సింహాచలంనాయుడు భార్య వరహాలమ్మ అనారోగ్యంతో మృతిచెందారు. ఈయన కుమారుడు శ్రీహరి రాష్ట్ర సమాచార కార్యాలయంలో చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. నెల రోజుల వ్యవధిలో తల్లిదండ్రులు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకొన్నాయి. మామిడి పల్లిలోని శ్రీహరి ఇంటి వద్ద పార్ధివదేహానికి టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, ఎంపీటీసీ మాజీసభ్యుడు చిటిమిరెడ్డి సూర్యనారాయణ నివాళులర్పించారు. 


ముఖ్యమంత్రి జగన్‌ సంతాపం

చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ పూడి శ్రీహరిని ముఖ్యమంత్రి జగన్మో హనరెడ్డి మంగళవారం సాయంత్రం ఫోన్‌లో పరామర్శించారు. తండ్రి సింహాచలంనాయుడు మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. 


 


Updated Date - 2020-11-04T04:30:23+05:30 IST